SSNEWS (తాండూర్) : ఎన్నికల ప్రచారం అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజా భవన్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2ఏళ్ల లో సాధించిన అభివృధి తోనే ప్రచారం చేశామని తెలిపారు. అభివృద్ధి పనులు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ అందిస్తారని అన్నారు. ముఖ్యంగా పాత తాండూర్ లో 90 కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం అయింది.అలాగే 40 కోట్లతో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.నీటి కష్టాలు తీర్చేందుకు పర్మనెంట్ సొల్యూషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ప్రజలు మా కృషికి గుర్తింపుగా మెజార్టీ స్థానాలు ఇస్తారని ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ ఖాయం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దారసింగ్, బాల్ రెడ్డి,అబిబులాల,మురళి గౌడ్,రవి గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.