* ఆలయ ధర్మకర్తలు మేడిశెట్టి జగన్నాథం, చంద్రకళ ఆధ్వర్యంలో..
SSNEWS (తాండూర్): తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ మల్రెడ్డిపల్లి వెళ్లే మార్గంలో వెలసిన శ్రీ పాండురంగ దేవాలయం 31 వ వార్షికోత్సవం ఆలయ ధర్మకర్తలు మేడిశెట్టి జగన్నాథం ,చంద్రకళ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. శ్రీ పాండురంగ దేవాలయ భక్త బృందం, శ్రీ గాయత్రి మహిళా భక్త బృందం, శ్రీ గీత సత్సంగ్ భక్త బృందం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచి స్వామి వారి మేలుకొలుపు, అభిషేకము, విష్ణు సహస్రనామ జప యజ్ఞం, శ్రీ రుక్మిణి విట్టల్ కళ్యాణ మహోత్సవం, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ భక్త సురేష్ శ్రీ విశ్వామిత్ర తపోభూమి ఆశ్రమం మాలాక్కరం చేవెళ్ల స్వామి వారు మాట్లాడుతూ.. భక్తి ముక్తికి మార్గమని, ఆస్తులు ,అంతస్తులు, ధనం ఎంత ఉన్నా భగవంతుని భక్తి ముందు నిలబడవని అన్నారు. భక్తితో కొలిచి భగవంతుని సాక్షాత్కారం పొందన ఆ పాండురంగడు మహిమాన్వితుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, యువకులు , పెద్దలు విశేషంగా పాల్గొన్నారు.