SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న ఎనిమిదో వార్డులో భారీ మెజార్టీతో ఎండి జావిద్ విజయం సాధించారు. దాదాపు 836 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థికి పోలైన ఓట్ల కంటే సుమారు 200 ఓట్ల ఆదిక్యం సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎండి జావిద్ తక్షణమే తన విధి నిర్వహణలో దృష్టి పెట్టాడు. విధి నిర్వహణలో భాగంగా రాజీవ్ గృహకల్ప లోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో, విద్యార్థులతో విద్యాబోధనపై సమీక్షించారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యాబోధనలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా మెరుగైన విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యా స్థాయిని పెంచేందుకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా 8 వ వార్డు అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ప్రయత్నాన్ని మొదలు పెడతానని చెప్పారు. వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ నివారణపై ఎప్పటికప్పుడు మునిసిపల్ సిబ్బందితో నిర్వహణ చేపడతామని తెలిపారు. కౌన్సిలర్ వెంట TRS పార్టీ సీనియర్ నాయకులు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.