* తాండూర్ లో 7 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు
* పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థుల సంఖ్య 3475
* ఐదు నిమిషాల నిబంధన పాటించాల్సిందే
* పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
* జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశం
SSNEWS (తాండూర్): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 25 బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో ఏడు కేంద్రాల వద్ద పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఆర్ కృష్ణయ్య, మల్లినాత్తప్ప పేర్కొన్నారు. తాండూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో2 కేంద్రాలు, సింధు బాలికల జూనియర్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాల, సిద్ధార్థ జూనియర్ కళాశాల, భాష్యం జూనియర్ కళాశాల, సోషల్ వెల్ఫేర్ కళాశాల లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.2025_26 సంవత్సరం లో 3475 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉందని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాల ముందే హాజరు కావలసిన నిబంధన పాటించవలసిందేనని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందే హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నేరుగా వెళ్లేందుకు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సులభతరంగా చేరవచ్చును. పరీక్షా కేంద్రాలలో ఇన్విజిన్ లెటర్స్, సిబ్బంది , విద్యార్థులకు సెల్ ఫోన్ అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయా పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని తెలిపారు.