* శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 316 వ అవతార దినోత్సవం
* భోగి పూజ, ఆధ్యాత్మిక ,సాంస్కృతిక వేడుకలు
* తీర్థ ప్రసాదాలు,అన్న ప్రసాద వితరణ
__శ్రీ శ్రీ రామావత్ సురేంద్రనాయక్ మహారాజ్, మాత శాంతాబాయి
SSNEWS (పెద్దేముల్ ) : శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 316వ అవతార దినోత్సవాన్ని ఈ నెల 20 న శుక్రవారం నిర్వహించనున్నట్లు శ్రీ రమావత్ సురేంద్రనాయక్ మహారాజ్ తెలిపారు. పెద్దేముల్ మండల కందనెల్లి తండా యాడి బాపు గాడ్ ఆశ్రమం లో శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ అవతార దినోత్సవ వేడుకలను వైభవంగా జరపాలని నిశ్చయించారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ.. భోగి పూజ, ఆధ్యాత్మిక ప్రవచనం, సాంస్కృతిక వేడుకలు, భారత్ బంజారా ధర్మస్థాపన సభలు, అనంతరం, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు ,సేవా తత్పరులు, బంజారా నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు ,కార్యకర్తలు విశేషంగా హాజరుకావాలని కోరారు.