SSNEWS (తాండూర్) : తాండూరు పట్టణంలో ఈనెల 19న గురువారం హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళికామాత దేవాలయం ఆవరణకు యువతి,యువకులు, హిందుత్వం వాదులు, హిందూ సంఘాల నాయకులు ,కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాళికామాత దేవాలయం నుండి, వినాయక చౌక్,ఇందిరా చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొనాలని కోరారు.