👉 కాంగ్రెస్+ఎంఐఎం+ఇండిపెండెన్స్ తో కలిసి అధికారం చేపట్టవచ్చును
SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురు ముదురు స్వల్ప ఘటనలతో ఫిబ్రవరి 11న పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగడంతో ఇటు మునిసిపల్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల అనంతరం పట్టణంలోని అన్ని వార్డులలో పోలింగ్ సరళి పై సర్వేలు కొనసాగాయి ఈ నేపథ్యంలో ఎస్ఎస్ న్యూస్ సామాన్యుని స్వరం న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా పలువురు ఓటర్ల అభిప్రాయాలను పరిశీలించిన మీదట ఎగ్జిట్ పోల్స్ అందించబోతున్నది. ఎస్ ఎస్ న్యూస్ సేకరించిన సమాచారం మేరకు తాండూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగవచ్చని తెలుస్తుంది. అయినప్పటికీ ఫలితాలు మాత్రం మిశ్రమమే అని నిర్ధారించడం జరిగింది. తాండూర్ మున్సిపాలిటీ హంగు దిశగా పయనించవచ్చని అంచనా వేయడం జరిగుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలతో ముందంజలో ఉంటుంది .బి ఆర్ ఎస్ పార్టీ 12 స్థానాలతో సరిపుచ్చుకోవచ్చును. ఇక బిజెపి 3 స్థానాలతో కొనసాగుతోంది. ఎంఐఎం పార్టీ నాలుగు స్థానాలు కైవసం చేసుకోవచ్చును. ఈసారి ఇండిపెండెన్స్ 2 స్థానాలకే పరిమితం కావచ్చునని ప్రజా అభిప్రాయం మేరకు ఈ ఎగ్జిట్ పోల్స్ అందించడం జరుగుతున్నది. ఇందులో కొంతవరకు అటు ఇటుగా మార్పు జరిగిన తాండూర్ మున్సిపాలిటీ మాత్రం హంగు దిశగానే పయనించవచ్చునని పలువురి అభిప్రాయం. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీతో కలిసి ఇండిపెండెన్స్ సహకారంతో మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందని విశ్వాసనీయంగా అందిన సమాచారం మేరకు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాము. తినబోతూ రుచులు ఎందుకు వెతకాలి అన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ధైర్యం ఫలిస్తుందా లేక ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటా అన్న ధీమా తో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం అవుతుందా! తెలుస్తోంది .మరి కొన్ని గంటలలో.. తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేస్తామన్న ఎం ఐ ఎం మాట నిలుస్తుందా వేచి చూద్దాం. ఈ అంచనాల మేరకు ఆయా పార్టీల కౌన్సిలర్లు ప్రలోభాలకు లోనై అంచనాలను తలకిందులుగా చేయవచ్చునని సమాచారం కూడా వెలువడడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చునని బహిర్గత పరుస్తున్నాం. ఏది ఏమైనా కొన్ని గంటల్లో ఫలితాలను చూడబోతున్నాం అంతా సజావుగా సాగాలని ఆశిద్దాం.