SSNEWS ( ఊట్కూర్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు తమ ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ అన్సార్ హుస్సేన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మొహమ్మద అన్సార్ హుస్సేన్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారానే నాయకులను ఎన్నుకునే అవకాశం ఉందని అన్నారు. ఓటరు తమ హక్కును నిర్భయంగా వినియోగించుకొని స్వచ్ఛమైన పరిపాలకులను ఎన్నుకోవాలని తెలిపారు. ఓటు వజ్రాయుధం లాంటిదని అలాంటి ఓటును అమ్ముకుంటే బానిసలు కావలసి వస్తుందని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకులను ఎన్నుకుంటేనే సుస్థిర పరిపాలన, ప్రజలకు అందుతుందని చెప్పారు. రాజ్యాంగము మనకు కల్పించిన హక్కులలో అత్యంత విలువైనది, ఆయుధం లాంటిది ఓటూ మాత్రమే యని అన్నారు.ప్రతి ఒక్కరు తెలుసుకొని అలాంటి హక్కును సమర్థవంతంగా ఉపయోగించిన నాడే దేశం, రాష్ట్రం ,స్థానిక సంస్థలలోమంచి నాయకులు పరిపాలన అందిస్తారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి తప్పకుండా ఓటు వేయాలని కోరారు.