* అభివృద్ధి మంత్రం ,వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట
* సాయి పూర్ ప్రజలు విజ్ఞులు, రాజకీయ చతురత నేర్చిన ఓటర్లు
* సాయిపూర్ లో మద్యం , ధన ప్రవాహం జోరందుకుంది.
SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చరమాంకానికి చేరుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ తమ ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు? వారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి? వారికి ఎలాంటి తైయిలాలు ఇవ్వాలని ఆలోచనలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిపూర్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థులు ఈపాటికి విజయ బావుటా మాదే అని ప్రకటించుకుంటున్న తరుణంలో పిడుగు లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన చతురతతో సాయిపూర్ ప్రాంతంలోని 9 ,10, 11, 12 వార్డులలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఓడ్డీ ప్రయత్నాలు చేస్తున్నారు. కారు దూకుడుకు బ్రేక్ వేస్తున్న హస్తం అంటూ ఆయా వార్డులలోని వివిధ వర్గాలను ,కుల సమీకరణలను, సమీక్షించి వారికి తగు విధమైనటువంటి విధంగా హామీలు ,అభయ హస్తాలు చేస్తున్నట్లు చాప కింద నీరులా కాంగ్రెస్ ప్రవాహం పోతుందని సైలెంట్ ఓటింగ్ ద్వారా ప్రక్రియ మొదలుపెట్టినట్లు అభిజ్ఞ వర్గాల సమాచారం. ఎమ్మెల్యే ఎత్తుగడలకు సాయిపూరు దాసోహం అన్నట్లు సైలెంట్‌గా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సాయిపూర్ ఓటర్ల, ప్రజలు విజ్ఞులు, రాజకీయ చతురత నేర్చిన ఓటర్లు వారిలో చాలామంది ఆలోచించి ఓటు వేసే వ్యక్తులు ఉన్నారని కౌన్సిలర్ అభ్యర్థులు తదనుగుణంగా వారికి నచ్చజెప్పి వ్యక్తిగత లాభం, కాలనీ సమిష్టి లాభం కోసం, తైయిలాలు ప్రకటిస్తున్నట్లు తెలుస్తున్నది. సాయిపూర్ లోని నాలుగు వార్డులలో మధ్యo గత వారం రోజులుగా ఇంటింటికి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్నట్లు తెలియ వస్తుంది. అదేవిధంగా డబ్బు తో ఓట్లు కొనుగోలు సాగుతుందని కూడా ప్రజలంతా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద పట్టణములో సాయిపూర్ వార్డులలో గెలుపు ఓటములపై ప్రత్యేకత సంతరించుకుంటున్నది.