SSNEWS (నారాయణ పేట) : నారాయణపేట జిల్లా నారాయణపేట పట్టణంలో ఓ మహిళా కడుపులోనుంచి 15 కిలోల కనితిని ఆపరేషన్ ద్వారా తొలగించడం జరిగింది. ఆదివారం ఈ అరుదైన ఆపరేషన్ పట్టణంలోని గాయత్రి ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంజిత్, డాక్టర్ నీలవర్ష మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా కోసిగి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ పెంటమ్మ తన కడుపులో బరువుగా ఉందని తరచూ కడుపునొప్పి వస్తుందని డాక్టర్లకు తెలిపింది . దీంతో డాక్టర్లు పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు సిఫారసు చేశారు. పరీక్షల అనంతరం డాక్టర్ల కడుపులో రోజురోజుకు కనితి పెరుగుతుందని గుర్తించారు. ఈ మేరకు మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి తక్షణమే ఆపరేషన్ ద్వారా కనితిని తొలగించాలని సూచించారు .డాక్టర్ల సూచన మేరకు కుటుంబ సభ్యులు ,బాధిత మహిళ ఆపరేషన్ కోసం ఒప్పుకొనగా మహిళ కడుపులో పెరిగిన 15 కిలోల కనితిని తొలగించి ఆపరేషన్ విజయవంతంగా ముగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. ఇది నారాయణపేట పట్టణంలోనే అరుదైన చికిత్సగా పలువురు ప్రశంసిస్తున్నారు.