SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూర్ లో పర్యటన నిమిత్తం కేటీఆర్ వస్తున్నారు.భారత రాష్ట్ర సమితి శ్రేణులను ఉత్తేజపరిచి, కౌన్సిలర్ స్థానాలను గేలిపించేందుకు మాజీమంత్రి కేటీఆర్ తాండూర్ కు వస్తున్నట్లు తాండూర్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైలం రెడ్డి తెలిపారు. తాండూర్ లోని ఇందిరా చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సభ జరగనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పట్టణములోని బిఆర్ఎస్ శ్రేణులు, కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.