* అభివృద్ధి కావాలంటే 36 సీట్లు కాంగ్రెస్‌కు ఇవ్వాల్సిందే
__మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెల్లడి
SSNEWS (తాండూర్) : తాండూరు మున్సిపల్ ఎన్నికల వేడిని మరింత హీటెక్కించేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తాండూర్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు సజావుగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించినట్లయితే మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు బాగుంటాయని మంత్రి శ్రీధర్ బాబు పాత తాండూర్, గాంధీ చౌక్ లో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్స్ లో వెల్లడించారు. బిజెపి బిఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. చైర్మన్ BRS,వైస్ చైర్మన్ బీజేపీలు పంచుకోవాలని రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన సీనియర్ నాయకులు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అభివృద్ధి సంక్షేమం సమ పాలలో తీసుకొని మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు. తాండూర్ మున్సిపల్ పీఠాన్ని దొంగల చేతికి ఇస్తే సర్వనాశనం అవుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరోపించారు. తాండూర్ అభివృద్ధి కావాలంటే 36 సీట్లు కాంగ్రెస్‌కే ఇవ్వాలని ఓటర్లను కోరారు. బిఆర్ఎస్ తన మేనిఫెస్టోలో రాజకీయాలకు బదులుగా వ్యాపార ధోరణితో 10, 20 రూపాయల ఖర్చుతో మినరల్ వాటర్ ను ఇస్తామని బిజినెస్ చేస్తుందని విమర్శించారు. స్వచ్ఛమైన కాగ్న నీరు ఉండగా మినరల్ వాటర్ తో పని ఏముందని ప్రశ్నించారు. దయచేసి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్, హైదరాబాద్ మాజీ చైర్మన్ బొంతు రామ్మోహన్, ముజీబ్ ఖాన్, అబ్దుల్ రావుఫ్, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.