👉 8 వ వార్డ్ లో విజయం నాదే _జావిద్ బిఆర్ఎస్ అభ్యర్థి
👉 రోహిత్ అన్న ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న
👉 గత 7 ఏళ్లుగా వార్డు ప్రజల సమస్యలపై పోరాటం చేశా
👉 తాండూర్ లోనే భారీ మెజార్టీతో గెలుస్తా
తాండూర్ (SSNEWS) : తాండూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరందుకున్నది. రెండవ రోజు అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు 96 నామినేషన్లు నమోదు అయినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. తాండూర్ లోనే అత్యధిక ఓటర్లు ఉన్న 8వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున ఏం డి జావిద్ భారీ ఎత్తున ఊరేగింపుగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 8వ వార్డులో విజయం నాదేనని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆశీర్వాదంతో వార్డు ప్రజల అండతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఎనిమిదో వార్డులో గత ఏడు సంవత్సరాలుగా వార్డు సమస్యలపై పోరాటం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. తాండూర్ లోనే అత్యంత భారీ మెజార్టీతో తన విజయం ఖాయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు యువకులు మహిళలు మైనారిటీ వర్గాలు తనను ఆశీర్వదిస్తున్నట్లు వారి ఆశీర్వాదంతో వార్డుని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.