* కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తలారి సాయప్ప నామినేషన్
* ఏలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ధైర్యం ఉంది
* గెలిచి ఎమ్మెల్యేకు బహుమతి ఇస్తా
తాండూర్ (SSNEWS) : తాండూర్ పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల సందడి మొదలైంది. మొదటిరోజు 11 నామినేషన్ దాఖలు అయినట్లు ఎన్నికల ఇంచార్జ్ తెలిపారు.8 వ వార్డ్ నుంచి మొదటిరోజు ఒక నామినేషన్ మాత్రమే నమోదు అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తలారి సాయప్ప తన మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అండతో ఎనిమిదవ వార్డులో గెలిచి తీరుతానని అన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలనైన ఎదుర్కొనే ధైర్యం తనలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యేకు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశాన్నిచ్చినందుకు కార్యకర్తలకు ,నాయకులకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.