తాండూర్ (SSNEWS) : తాండూర్ మున్సిపాలిటీలో నామినేషన్ పర్వం కొనసాగుతోంది. 8 వ వార్డు నుంచి MA హమీద్ రెహమాన్ పోటీ చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. తన నామినేషన్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించి టికెట్ కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే వార్డు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా గెలిచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిలో భాగమై వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మైనార్టీ ఓటర్లు తమ వైఫై ఉన్నారని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల, నాయకుల అండదండలతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తపరిచారు.