🤜ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పట్లోళ్ల ఫ్యామిలీ
🤜ఎక్కడున్నా రాజకీయములో పట్టు
🤜అనర్గళమైన వాణి ఆమె సొంతం
🤜ఎత్తుగడలో దిట్ట ఆయన నైజం
🤜ఇదే ఆ దంపతుల బలం
తాండూర్ (SSNEWS) : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో, గెలుపు గుర్రాల గుర్తింపు లో తలమునకలై, రాత్రి పగలు తేడా లేకుండా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో బిఆర్ఎస్ పార్టీ తనదైన ముద్ర కోసం కసరత్తు మొదలెడింది. ఈసారి తాండూర్ మున్సిపల్ గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కృత నిశ్చయంతో ముందుకు సాగుతూ పట్లోళ్ల దీప నర్సింలు కుటుంబాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలపబోతున్నది. రిజర్వేషన్లలో తాండూర్ మున్సిపల్ బీసీ జనరల్ కావడం కలిసి వచ్చిన అంశంగా ఆ కుటుంబం సర్వశక్తులు వడ్డీ తలపడబోతున్నది. 9వ వార్డు,10 వ వార్డు లో తాము చేసిన అభివృద్ధి, ఓటర్లలో ఏర్పరచుకున్న నమ్మకమే తమకు విజయాన్ని చేకూరుస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇకపోతే పట్లోళ్ల నరసింహులును పట్టణంలో అందరూ ముద్దుగా బిఏ నరసింహులు అన్న అని పిలుచుకుంటూ ఉంటారు. రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్న పట్టు సాధించే వ్యక్తిని అందరూ గుర్తిస్తారు. ఆయనకు తోడుగా, జోడుగా దీపా నర్సింహులు వైస్ చైర్మన్ గా సేవలందించారు. ఆమె అనేక సభలలో అనర్గళమైన వానిని వినిపిస్తూ ప్రజలను మెప్పించడంలో, వాగ్దాటితో ఆకర్షించడంలో ఆమెకి ఆమె సాటి అని పేరు సంపాదించారు. ఇదే ఆమె ప్రత్యేకత. ఇకపోతే పట్లోళ్ల నర్సింలు రాజకీయ ఎత్తుగడలలో దిట్ట అని, ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా తనదైన ప్రత్యేక శైలితో ఆకర్షించడం ఆయన నైజం. రాజకీయములో అన్ని విధాల సమతూకముతో తులతూగుతున్న కుటుంబం గా గుర్తించారు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. రోహిత్ అన్నకు నమ్మిన బంటుగా ఈ ఎన్నికల్లో చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటుందని , బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అన్ని వర్గాలను ఆదరిస్తూ పట్టణ అభివృద్ధి కై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్న పట్లోళ్ల కుటుంబ భవితవ్యంపై ఎదురు చూద్దాం.