* 7 వ వార్డ్ లో 44 లక్షల పనులు ప్రారంభం
* ఎమ్మెల్యే నిధుల తో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ
* బాతుల వెంకటేష్,నాగు ఆధ్వర్యంలో
తాండూర్ (SSNEWS) : తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే నిధుల నుంచి వార్డు అభివృద్ధి పనులు చేపట్టినట్లు బాతుల వెంకటేష్, బాతుల నాగు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నిధుల నుంచి సుమారు 44 లక్షల రూపాయలు వెచ్చించి ఏడవ వార్డులోని కోకిల కాటేజ్ ప్రాంతంలో 30 లక్షల తో సిసి రోడ్డు నిర్మాణం, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు . అదేవిధంగా ఘాజీపూర్ సలాం బై ఇంటి నుంచి మొదలుకొని 14 లక్షల నిధులను సిసి రోడ్డు, డ్రైనేజీ కొరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంట్రాక్టర్ ఉప్పరి మల్లేశం ద్వారా నాణ్యమైన రోడ్లను ఏర్పాటు చేయడం, డ్రైనేజీ వ్యవస్థలో ఎలాంటి లోపాలు రాకుండా పటిష్టంగా మురుగు కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కాలనీ ప్రజలు, పార్టీ నాయకులు కలిసి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాతుల వెంకటేష్, బాతుల నాగు, సావిత్రమ్మ ,జాకీర్ హైమద్ కురేసి, లోంక నర్సింలు, దానం సురేష్, ఫాజిల్ బై, హైమద్ ,బిలాల్, అలీ భాయ్, సలాం భాయ్ ,బాతుల నాగరాజు తదితర కార్యకర్తలు ,నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు
