తాండూర్ (SSNEWS) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బుయని మనోహర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ల మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలైంది.ఒకరికొకరు సవాల్ ప్రతి సవాల్ విసురుతూ మాటల యుద్ధం తారాస్థాయి కి చేరుతున్నది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బిఆర్ఎస్ పార్టీ తమ తమ అభ్యర్థుల విజయం కోసం మీడియా ముందు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన రెండు సంవత్సరాల కాలంలో తాండూర్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని దమ్ముంటే చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గంలో ఏ 20 గ్రామాలైన,లేదా పట్టణంలో ఏ వార్డులోనైనా చర్చించేందుకు సిద్ధమని ఎన్నికల తర్వాత చర్చకు రెడీ అని ప్రతి సవాల్ చేశారు. ఫ్యాక్షనిస్టు లా దౌర్జన్యాలు చేస్తూ, ప్రలోభాలకు గురి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీలు ఉత్తర కుమారుని లా ప్రగల్బాలు మాత్రమే పలుకుతారని , ఆ రెండు పార్టీలు ఎక్కడా చర్చలు చేయరని, ప్రజలను మోసం చేయడమే వారి ప్రధాన ఎజెండా అని బిజెపి నేతలు విమర్శించారు. ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రభావితం కోసం చేస్తున్న గారడిగా ప్రజలు భావిస్తున్నారు. ఓటర్లు చాలా తెలివైన వారిని నిజానిజాలు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకుంటారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కాసుల కక్కుర్తికి పోకుండా సరైన నాయకుని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.