👍 తాండూరు బల్దియాపై బిజెపి జెండా
👍 అన్ని వార్డులలో బిజెపి పోటీ గెలుపే లక్ష్యంగా యుహాలతో
👍 ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా ఉండేది ఎంఐఎం పార్టీ
👍 కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీల వర్గ పోరుతో పదేళ్లు వెనుకకు
👍 రాజకీయ డ్రామాలు ఆడుతున్న కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలి
👍 బిజెపి పై మోగ్గు చూపుతున్న ఓటర్లు
తాండూర్ (SSNEWS) : తాండూర్ బల్దియా పై బిజెపి జెండా ఎగరవేస్తామని పట్టణ బిజెపి అధ్యక్షుడు నాగారం మల్లేశం వెల్లడించారు. తాండూర్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుల, కార్యకర్తల సహకారంతో ఓటర్ల మనసులను గెలుచుకునే విధంగా యుహాలతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా బిజెపి అన్ని వార్డులలో పోటీ చేస్తుందని చెప్పారు. ఓటర్లు చాలా తెలివైన వారిని కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే నాయకులకు తగిన సమయంలో బుద్ధి చెప్తారని తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి తొత్తుగా వ్యవహరించేది ఎంఐఎం పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల వర్గ పోరుతో తాండూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో పదిహేళ్లు వెనుకకు వెళ్ళిందని విమర్శించారు. రాజకీయ డ్రామాలు ఆడుతున్న ఆ రెండు పార్టీలను ఓడించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాండూర్ లోని ప్రతి వార్డులో యువత, మహిళలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రతి వార్డు నుండి పార్టీ టికెట్ కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయని చెప్పారు.
