* జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు
* జనవరి ఒకటి నుంచి 31 వ తారీకు వరకు
* ప్రతి యాక్సిడెంట్ ను హత్యగా కేసు నమోదు చేస్తాం
* తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదవ్
తాండూర్ (SSNEWS) : రహదారులపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. రహదారి భద్రతా నియమాలని ఉల్లంఘించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను బలి తీసుకోవడం హత్య కేసు కిందకి వస్తుందని ,ఇట్లాంటి వారిపై హత్య కేసు నమోదు చేస్తామని తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదవ్ వాహనదారులను హెచ్చరించారు. జనవరి ఒకటి నుంచి 31 వ తారీకు వరకు జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా విలియం చౌరస్తాలో డీఎస్పీ ప్రసంగించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ప్రతి వాహనదారుడు అత్యంత జాగ్రత్తగా వాహనాలను నడుపుతూ గమ్యస్థానాలకు చేరాలని తెలిపారు. తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలతో పాటు హత్య కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మనము మన కుటుంబం భద్రంగా ఉండాలని భావించిన మాదిరిగానే సమాజంలో అందరి యొక్క భద్రత మనదే అన్న భావనతో నడుచుకోవాలని కోరారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పని చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి తో పాటు స్థానిక ఎస్సై పోలీసులు పాల్గొన్నారు.
