*తాండూర్ మున్సిపల్ కాంగ్రెస్ దే
___ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
*18.70 కోట్ల తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
*నా హాయం లోనే కౌన్సిల్ మీటింగ్ ప్రశాంతంగా జరిగాయి.
*2028 వరకు అభివృద్ధిలో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
*పైలట్ మాఫియా ఆగడాలను, అవినీతిని బట్టబయలు చేస్తా
తాండూర్ (SSNEWS) : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాండూర్ మున్సిపల్ ఎన్నికలకు నగర మోగిందని 36 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తాండూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పాత తాండూర్ లోని అంబేడ్కర్ పార్కుల 18.70 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ…గత మున్సిపల్ కౌన్సిల్లో ఇరువర్గాల తగాదాల వల్ల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ని సజావుగా జరిగే విధంగా చూసానని తెలిపారు. తాండూర్ మున్సిపాలిటీ రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఈ కలను 2028 లోగా నెరవేరుస్తానని ఇందుకు నాదే గ్యారంటీ పేర్కొన్నారు. గత ఎమ్మెల్యే మాదిరిగా ఉపన్యాసాలు ఇవ్వనని అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు. కుటుంబాలలో, నాయకులలో తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని రాబోయే రోజుల్లో పైలట్ ఆధ్వర్యంలో జరిగిన మాఫియా ఆగడాలను, అవినీతిని బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు ఇతరులకు మోసం చేయడం జరగలేదని అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి గురించి నాకంటే ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి బాగా తెలుసు అని మోసం ఎలా చేశాడో పూసగుచ్చినట్లు వివరించిన బుద్ధి మారలేదని ఆగ్రహించారు. తాండూర్ పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను గెలిపించాలని కోరారు. మీరు సంపూర్ణ మెజార్టీనిస్తే తాండూర్ ని మార్చి చూపిస్తానని పేర్కొన్నారు.
