* ఎన్నికల శంఖారావం మోగించిన BRS
* కాంగ్రెస్ వీడి బిఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ పరిమళ
* తాండూర్ మున్సిపల్ లో BRS జెండా ఎగరేస్తాం
* మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్(SSNEWS): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని
మోగించింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ దంపతులు కాంగ్రెస్ను వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పరిమళ రవీందర్ ఆధ్వర్యంలో ఎంపీటీ హాల్ లో ఏర్పాటుచేసిన సభలో పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ గత మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచి కొన్ని ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ 23వ వార్డును వదలకుండా వార్డు లోని సమస్యలపై ఎప్పటి కప్పుడు పోరాడుతూనే ఉందని అన్నారు. ఆమె తిరిగి బిఆర్ఎస్ కుటుంబంలో చేరడం సంతోషకరమని తెలిపారు. ఇక నుంచి తాండూర్ మున్సిపాలిటీలో చేరికల పర్వం మొదలవుతుందని చెప్పారు. ఈసారి తాండూర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ జండా ఎగరవేయడం ఖాయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన లెఫ్ట్ రైట్ లో ఉన్న నాయకులకు ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను తాను సాధించినట్లుగా చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయని వివరించారు. ఎమ్మెల్యేకు ఇకనుంచి షాకుల పైన షా కులు ఇస్తూనే ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ కౌన్సిలర్ శోభారాణి, నరేందర్ గౌడ్, మంకాల రాఘవేందర్ , వరాల శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాకూర్ , అనురాధ నాయకులు వీరేందర్ రెడ్డి, శకుంతల దేశ్ పాండే, అబ్దుల్ సలీం, యూనుస్, భషరత్, సందీప్ రెడ్డి, ఇంతియాజ్, వివిధ వార్డుల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
