🤜మున్సిపల్,ఎండోమెంట్ అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మాణం
🤜 దేవాలయ కాంప్లెక్స్ పై కొర్ట్ స్టే దుకాణాలు సీజ్
🤜దేవాదాయ శాఖ చట్టాన్ని అతిక్రమించిన వైనం
🤜రీ టెండర్ చేసి పేదలకు లబ్ది చేయాలి
🤜 అభివృధి పేరుతో భారీ కుంభకోణం కిరణ్ పై ప్రవీణ్ ఆరోపణ
🤜ఎమ్మెల్యే ను తప్పు దోవ పట్టించాడనీ ఆగ్రహం
🤜డిపాజిట్ స్కీమ్ పేరు తో ఒక్కో షాపుకు లక్షల్లో వసూళ్లు
🤜 గతంలో చట్టం అమలు తో ముతబడ్డ కాంప్లెక్స్ అయిన మారని పాలకులు తీరు
🤜ఎమ్మెల్యే అండ తో దోచుకో_ దాచుకో స్కీమ్ అమలు
🤜 బద్రేశ్వర కాంప్లెక్సు కు తాళం బాధితుల నేత్తిన బారం
🤜 ఎన్నికల వేళ ఆరోపణల మాల
🤜కోర్టు మెట్లు ఎక్కిన వీర శైవ సమాజం సభ్యుడు ప్రవీణ్ పటేల్
తాండూర్ (SSNEWS) : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయం భక్తులకు ఇలవేల్పుగా వెలుగొందుతుంది. అభివృద్ధిలో భాగంగా దేవాలయ దుకాణాలు పునర్నిర్మాణంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు కిరణ్ పటేల్ పై ప్రవీణ్ పటేల్ మీడియా సాక్షిగా ఆరోపణ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మున్సిపల్ పర్మిషన్, ఎండోమెంట్ అనుమతులు లేకుండా దుకాణాల సముదాయాన్ని కూల్చడం, నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు.నిర్మాణ క్రమంలో కోట్ల రూపాయలు దండుకొని అక్రమాలకు పాల్పడ్డట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నట్లు తెలిపారు.కోర్టు మెట్లు ఎక్కిన ప్రవీణ్ పటేల్ తెచ్చిన స్టే తో దుకాణ సముదాయం సీజ్ చేయబడింది. దీంతో లక్షల్లో డబ్బులు ఇచ్చిన బాధితుల పై భారం పడింది. కులం పోయిన సుఖం దక్కుతుందన్న ఆశతో డబ్బులు సమర్పించుకున్న బాధితులకు నిరాశ ఎదురయింది. దేవదాయ చట్టాన్ని అతిక్రమించినందుకు కిరణ్ పటేల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిపాజిట్ స్కీం పేరుతో ఒక్కో షాపుకు లక్షలలో డబ్బులు వసూలు చేయడం వల్ల నిరుపేద వ్యాపారులకు దుకాణాలు దక్కలేదని చెప్పారు. గతంలో భద్రేశ్వర దేవాలయం దుకాణాల కాంప్లెక్స్ మూతబడి అనేకమంది వ్యాపారస్తులు రోడ్డున పడ్డ సంగతి తెలిసిన పాలకుల తీరు మారలేద ని ప్రజలు గుసగుసలాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేను తప్పుదోవ పట్టించి ప్రారంభోత్సవాలు చేయించారని ప్రవీణ్ పటేల్ ఆరోపించారు. అయితే మరి కొంతమంది ఎమ్మెల్యే అండతోనే దోచుకో దాచుకో స్కీమ్ జరుగుతుందన్న అనుమానం వ్యక్తపరుస్తున్నారు. నిరుపేద వ్యాపారస్తులకు దుకాణాలు దక్కాలంటే రీ టెండర్ సిస్టం అమలు పరచాలని తద్వారా పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
