* 7 వార్డ్ BCజనరల్ సంతోషకరం
*పోటీలో ఉంటా గెలుపు సాధిస్తా
*వార్డ్ ఓటర్ల ఆశీర్వాదమే నా బలం
*అభివృద్ధి ఎజెండా బిజెపి లక్ష్యం
*బిజెపి ని బలపరిచి హిందుత్వాన్ని రక్షించండి
_తాండ్ర నరేష్ 7వార్డ్ BJP అభ్యర్థి
తాండూర్ (SSNEWS): తాండూర్ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రక్రియ ఖరారు తో రాజకీయం వేడెక్కింది.7 వ వార్డ్ బీసీ జనరల్ స్థానం ఖరారు కావడం చాలా సంతోషకరమని బిజెపి అభ్యర్థి తాండ్ర నరేష్ పేర్కొన్నారు. వార్డ్ ఓటర్ల ఆశీర్వాదంతో తన గెలుపు ఖాయమని చెప్పారు. అభివృద్ధి ఎజెండా బిజెపి లక్ష్యం అన్నారు. బిజెపిని బలపరిచి హిందుత్వాన్ని రక్షించాలని ఓటర్ మహాశయులకు మనవిచేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిం ,ముస్లిం అంటే కాంగ్రెస్ అనే నాయకులకు చెంపపెట్టుగా 7 వ వార్డ్ తీర్పు రావాలని కోరారు. అలాగే మతోన్మాద ఎంఐఎం ను, కుహనా సెక్యులర్ గా చెప్పుకుంటున్న బి ఆర్ఎస్ పార్టీలను ఓడించి, దేశం కోసం ధర్మం కోసం పాటుపడే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు .చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన వార్డు గెలుచి బహుమతిగా ఇస్తానని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించి అందరి మన్నలను పొందుతానని స్పష్టం చేశారు. ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా హిందుత్వమే ఏజెండాగా ముందుకు సాగే బీజేపీని బలపరిచి తనను గెలిపించాలని కోరారు.
