* ప్రజల కోసం _ప్రగతి కోసం
* అభివృద్ధి లక్ష్యం _సేవే నా మార్గం
* మీ సమస్య _నా బాధ్యత
*. నా బలం _మీ ఆశీర్వాదం
* పార్టీ విజయానికి వెన్నంటి ఉన్న కార్యకర్తను
* 8 వ వార్డ్ లో మైనార్టీ ఓట్లే కీలకం
. షేక్ నాసర్ కు టికెట్ ఇస్తే గెలుపు పదిలం
SSNEWS(తాండూర్): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆయా పార్టీలలో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ఈ నేపథ్యంలో తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు రాజీవ్ కాలనీ ,ఇందిరమ్మ కాలనీల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా షేక్ నాసర్ పోటీకి సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఆ పార్టీని నమ్ముకొని ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. తను సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకునిగా ఎదిగానని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో బుయ్యని మనోహర్ రెడ్డి విజయానికి కృషి చేశానని, అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సంపాదించినట్లు పేర్కొన్నారు. ప్రజల కోసం ,ప్రగతి కోసం ,అభివృద్ధి లక్ష్యంగా, సేవా మార్గముతో వార్డు ప్రజల ఆశీర్వాదామే తన బలంగా పేర్కొంటూ పార్టీ విజయానికి కీలకమైన మైనార్టీ ఓట్ల తో పాటు అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించే కార్యకర్తల బలం తనకు ఉందని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించాలని తద్వారా 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పదిలం చేస్తానని ఓటర్ల ఆశీర్వాదాన్ని కోరుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే కేటాయించాలని అభ్యర్థించారు.
