👉 తప్పుల ఓటర్ జాబితా .
👉 ఓటు చోరీకి ఈజీ మార్గం
👉 ఒక వ్యక్తికి రెండు ఓట్లు
👉ఓకె ఫోటో తో 2 ఓట్లు
👉ఈ చిత్ర విచిత్రాలకు బాధ్యులెవరు ?
👉సవరణలు చే పట్టని ప్రభుత్వం
👉 అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
👉 హడావుడిగా ఎన్నికల నిర్వహణకు కసరత్తు !
👉 ఓటరు జాబితా పెరగడంతో
ఏ పార్టీకి లాభం ?ఏ పార్టీకి నష్టం?
👉 అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి లేదా గోవిందా!
SSNEWS (తాండూర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల కసరత్తును తుది అంకానికి చేర్చింది. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తూ ఓటర్ల జాబితా సవరణల పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది. దీంతో తప్పుల తడకలుగా ఓటర్ల జాబితాలు తయారయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ ఓటరు జాబితాను పరిశీలించినట్లయితే అనేక చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. తప్పుల ఓటర్ జాబితాతో ఓటు చోరీకి సులభ మార్గాన్ని అధికారులే కల్పించినట్లు స్పష్టమవుతున్నది. వార్డు నెంబర్ 8 లో క్రమ సంఖ్య 318 మహమ్మద్ యాసర్ జావీద్ కు EPIC NO: XLV 2697027 తో ఓటు నమోదయింది. ఇదే వ్యక్తికి 321 క్రమసంఖ్యతో మహమ్మద్ యాసర్ జావిద్ EPIC NO: XLV 2685824 తో మరో ఓటు నమోదు అయింది. మరో వ్యక్తి ఎండి ఇమాముద్దీన్ క్రమ సంఖ్య 461,462 తో 2 ఓట్లు,EPIC NO: XLV 2692135,XLV 2661221లతో ఓట్లు నమోదయ్యాయి. వీరిరువురి ఫోటోలు, చిరునామా రెండు చోట్ల ఒకే మాదిరిగా ఉన్నాయి. ఇక మరో విచిత్రం ….క్రమ సంఖ్య 713,633 లో వ్యక్తులు వేరు వేరు, ఫోటో మాత్రం ఒకరే … ఈ విధమైన తప్పులతడక ఓటర్ల జాబితాతో సవరణలు పూర్తి చేయకుండానే ఎన్నికలకు వెళ్లడం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలియ వస్తుంది. ఇలాంటి తప్పులకు ఎవరు బాధ్యత తీసుకుంటారు ? ఉన్నతాధికారులే తేల్చి చెప్పాలి ! ఇలాంటి తప్పులతో ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇలా ఓటర్ల సంఖ్య పెరగడంతో ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం? అభ్యర్థులే తేల్చుకొని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం. లేదా మీ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. గోవింద ! గోవిందా!
