🕉️ యువతకు ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద
🕉️ హిందుత్వా ఐకాన్_స్వామీజీ
🕉️ హిందూ మతం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఘనుడు
🕉️ ప్రపంచ జ్ఞాని ఏకసంతాగ్రహి
SSNEWS (తాండూర్): స్వామి వివేకానంద 163 వ జయంతి తాండూరు పట్టణంలోని శాంతి మహల్ చౌరస్తా లో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు స్వామి వివేకానంద వేషా ధారణలతో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన ఆకర్షణీయంగా ,స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాండూర్ డి.ఎస్.పి నర్సింగ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నపరిమల్, మార్కెట్ చైర్మన్ బాల్రెడ్డి, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్, యాలాల్ ఎస్సై విఠల్ రెడ్డి, బిజెపి మాజీ కౌన్సిలర్ సాహూ శ్రీలత, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, వివేకానంద యువజన సంఘం నిర్వాహకులు వీరభద్రప్ప, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ,స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. స్వామీజీనీ హిందుత్వానికి ఐకాన్ గా అభివర్ణించారు. హిందూమతం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఘనుడని కీర్తించారు. ప్రపంచమే నీవ్వేరపోయేంత ప్రపంచ జ్ఞాని ఏకసంతాగ్రహి అని ఆయన చూపిన సమయస్ఫూర్తిని , యువభారతానికి ఆయన బోధించిన మార్గం అనుసరణీయం అని అన్నారు. నేటి యువత చెడు మార్గాన్ని వదలి దేశభక్తి, జాతీయత, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగి ఉండాలన్నారు. ఆదర్శవంతమైన జీవనం కోసం స్వామీజీ కలలుగన్న యువభారతాన్ని నెలకొల్పాలని యువతకు పిలుపునిచ్చారు. విద్యార్థులచే స్వామీజీ జీవిత వృత్తాంతాన్ని నాటక రూపకంగా చాలా చక్కగా వివరించారు.
