👉 డ్రగ్స్, స్మోకింగ్ కు అలవాటు పడ్డ మైనర్స్, కాలేజీ విద్యార్థులు
👉 చెడు అలవాట్లపై తల్లిదండ్రుల ఆందోళన
SS NEWS ( తాండూర్): వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వివిధ పేర్లతో చాయ క్లబ్బులు విరివిగా వెలిశాయి. ఏదో ఒక చాయ్ తాగడం అలవాటు పడ్డ వ్యక్తులుఆయాప్రాంతాలకు వెళ్లి చాయ్ తాగడం అలవాటు గా మారింది. మరి కొంతమంది అలసట తీరడానికి,బడలిక పోవడానికి ,మైండ్ ప్రశాంతంగా ఉంటుందని, కాస్తంత సమయం పిచ్చాపాటిగా మాట్లాడుకోవచ్చని చాయ్ కేంద్రాలకు రావడం పరిపాటు. అలాంటి కేంద్రాలు స్మోకింగ్ జోన్లుగా మారడం, మరి పరదాలు కట్టి పొగ తాగడానికి అవకాశాలు కల్పిస్తున్నటువంటి చాయ కేంద్రాలను గుర్తించి పోలీసులు స్మైల్ ఆపరేషన్ 11 సభ్యులు కలిసి మెరుపు దాడి చేశారు. ఈ చాయ్ కేంద్రాలలో మైనర్ బాలురు,కాలేజీ విద్యార్థులు చెడు అలవాట్లకు లోనై స్మోకింగ్ చేయడం, స్మోకింగ్ మాటున డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు నమోదయిన వ్యక్తుల సమాచారం మేరకు ఆకస్మిక దాడులు చేసినట్లు తెలిపారు. అక్కడ గుమి కూడిన విద్యార్థులకు, మైనర్లకు చెడు అలవాట్లు మానుకోవాలని, తల్లిదండ్రుల కలలను సహకారం చేస్తూ మంచి విద్యను అభ్యసించాలని సూచించారు. మళ్లీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ పిల్లలు చెడు అలవాట్లకు లోనవుతున్నట్లు గమనించిన కొంతమంది తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఆయా కళాశాలలో యాజమాన్యం, అధ్యాపకులు విద్యార్థుల హాజరుతోపాటు వారి వ్యవహార శైలిని కూడా గమనించి , తల్లిదండ్రులకు తగు సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. మైనర్లకు చాయ్ కేంద్రాలలో సిగరెట్లు ,గుట్కాలు, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు అమ్మబడవని బోర్డు పెట్టాలని సూచించారు.