మున్సిపాలిటీ లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి.
__నాయకుల పనితీరును బట్టి పదవులు వస్తాయి.
__పంచాయతీ ఎన్నికల తరహాలో ప్రయత్నం జరగాలి.
___MLA బుయ్యని మనోహర్ రెడ్డి
SSNEWS (తాండూర్) స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పురపాలక సంఘం ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లో బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే తాండూర్ మున్సిపాలిటీలో ఘనవిజయాన్ని సాధించాలని తెలిపారు. నాయకుల పనితీరును బట్టి పదవులు వాటి అంతట అవే వస్తాయని, పనితీరును మెరుగుపరుచుకొని పార్టీకి విధేయతగా పనిచేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు విస్తృత స్థాయిలో పనిచేయాలని కోరారు. ఈ సమావేశాని లో జిల్లా పార్టీ పరిశీలకులుగా రామ్ శెట్టి నరేందర్ రెడ్డి , జిల్లా ,మండల, స్థానిక నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
