* సగటు హిందువు
* జాతీయ వాద కార్యకర్త
* సామాన్య బిజెపి కార్యకర్తల
*మనసులో (లోతు) నీ మాట
Let us watch the story…
తాండూర్ (SSNEWS) : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొలది సామాన్య మానవుల, సామాన్య ఓటర్ల అంచనాలు రోజురోజుకు మారుతూ ఉండడం అందుకు తగ్గట్లు ఆయా పార్టీల నాయకుల ఎత్తుగడలు, బలాబలాలు ,అంచనాలు, సమీకరణలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఓటర్లలో మెజార్టీ ఓటర్లు అయినా హిందువులలో ఆశలు ,ఆకాంక్షలు, హిందుత్వసిద్ధాంతం పట్ల ఆకర్షణ పెరుగుతున్న తరుణంలో వాళ్ల వాళ్ల మనసుల్లోని భావాలు, భావవ్యక్తీకరణ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోని జాతీయవాద, హిందుత్వవాద, సామాన్య బిజెపి కార్యకర్తల మనసులను తట్టినప్పుడు వచ్చినటువంటి లోతైన మాటల ఆకాంక్షల మేరకు ఈ వ్యాసం రూపుదిద్దుకున్నది. ముఖ్యంగా బిజెపి అంటేనే హిందుత్వ పార్టీ అని లౌకిక శక్తులు, మేమే లౌకిక వాదుల మన్న పార్టీలు సహజంగా బిజెపిపై ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటప్పుడు సగటు హిందువు, సామాన్య బిజెపి కార్యకర్తలు ఆశిస్తున్న కోరికల మేరకు బిజెపి అధిష్టానం తీసుకోవలసిన నిర్ణయాలను ప్రభావితం చేస్తూ సూచిస్తున్న సలహాలు, సూచనలు, మనసులోని మాటలు విశ్లేషిస్తూ ….. భారతీయ జనతా పార్టీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో, గెలిపించుకోవడానికి వ్యూహాలలో భాగంగా ప్రచార అస్త్రాలు పై చర్చించినప్పుడు వెల్లడైన విషయాలను మీ ముందుకు తెస్తున్నాం.
1) హిందుత్వవాద సిద్ధాంతం, జాతీయ వాద దృక్పథం ఉన్నటువంటి వారికి టికెట్ కేటాయింపులో మొదటి ప్రాధాన్యత నివ్వాలి కోరుతూ..
2) పార్టీలు మార్చే అవకాశవాద రాజకీయాలకు పాల్పడే వ్యక్తులకు అసలు టికెట్ ఇవ్వకూడదని సలహా ఇస్తున్నారు.
3) గెలిచినా ,ఓడిన ,పార్టీ కోసం సిద్ధాంతం కోసం ,శ్రమ పడే వారికి అవకాశం దక్కాలని వారి ఆలోచన వ్యక్తమవుతున్నది.
4) కాసుల కక్కుర్తికి, కాషాయాన్ని అమ్ముకునే వారిని అసలే నమ్మవద్దని సగటు హిందూ గత సంఘటన ఆధారంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
5) గల్లీ రాజకీయం ,ఢిల్లీ రాజకీయం వేరు కానే కాదు, గల్లీలో గెలిస్తేనే ఢిల్లీకి బలమైన వాణి వినిపిస్తామన్న ఆలోచన ఓటర్లలో కల్పించాలి.
6) ఉత్తరాదిన హిందువులలో వస్తున్న మార్పు, దక్షిణాదిలో ఎందుకు రావడం లేదు ? మన లోపాలను విశ్లేషించుకొని ప్రజలలో దూసుకుని వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
7) దక్షిణాదిలో కాషాయ జెండా, హిందుత్వ ఎజెండా బలపడాలంటే స్థానిక సంస్థల నుంచి మొదలు కావాలన్నా బలమైన ఆకాంక్ష తో కార్యకర్తలను సిద్ధం చేసి, ఓటర్ల మనసులను గెలుచుకోవాలని పిలుపు ఇస్తున్నారు.
8) సనాతన ధర్మంపై జరుగుతున్న దాడిని, సామాన్య ప్రజల దాకా చేర్చడమే లక్ష్యంగా తద్వారా బలోపేతమైన రాజకీయ శక్తిని పెంపొందించుకోవాలని భావన వ్యక్తం చేస్తున్నారు.
9) ప్రస్తుత పరిస్థితులు బిజెపికి మంచి అవకాశం ఉందని తాండూరులో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడం అత్యంత సులభమని తెలిపారు.
10) తాండూర్ లో వివిధ పార్టీలు కౌన్సిలర్ల బదలాయింపు పై మాత్రమే దృష్టి సారించాయని తటస్థమైన పార్టీ బిజెపి అని గెలుపు సునాయాసమని పలువురు అభిప్రాయం .
11) స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులే ముఖ్య మైనపటికి దేశం,ధర్మం పట్ల ఆయా పార్టీల వైఖరిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఓటర్ల తీర్పు ఉండాలని అభిలాషిస్తున్నారు. ఈ మేరకు
తదితర అనేక అంశాలపై భారతీయ జనతా పార్టీ లోతైన ఆలోచనలతో అభ్యర్థులను ఎంపిక చేసి తగువిధంగా ప్రచారాన్ని మొదలు పెట్టాలని, సామాన్య హిందూవులు, జాతీయ వాదులు, సామాన్య బిజెపి కార్యకర్తలు మోడీ మార్క్ పాలనను ఆశిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఓటర్ల మనోగతాన్ని గెలుచుకొనుటలో బిజెపి పయనిస్తుందని ఆశిద్దాం.
