SSNEWS (తాండూర్): తాండూర్ పట్టణానికి చెందిన శివం గ్రామర్ హైస్కూల్ విద్యార్థి సుప్రజ టీమ్ ముఖ్య మంత్రి కప్ కు ఎంపికైనది. 7 వ తరగతి చదువుతున్న సుప్రజ టీమ్ లీడర్ గా చక్కని ప్రతిభ కనబరిచి నందున ఆమెను కెప్టెన్ గా ఎంచుకున్నారు.తన టీంను ప్రోత్స హిస్తున్న తీరును చూసి పాఠశాల చైర్మన్ గూలీ శివకుమార్,సిబ్బంది అభినందించారు. ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మీట్ లో సుప్రజ కబడ్డీ టీం మొదటి స్థానాన్ని గెలుచుకుంది. దీంతో వారి క్రీడా స్ఫూర్తికి మెచ్చి CM కప్ లో అడడానికి అవకాశం దక్కింది. సుప్రజ టీమ్ మరిన్ని లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన కృషి చేయాలని శివకుమార్ కోరారు. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ.. జిల్లాకు, గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తెచ్చే విధంగా పాటుపడతానని తెలిపారు.