* తాండూర్ ప్రజలు గత 20 ఏళ్ల లో ఇవ్వని తీర్పునిచ్చారు.
* ఎన్నికలప్పుడే పోరాటం తర్వాత అభివృద్ధి లక్ష్యం
___ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
SSNEWS (తాండూర్): తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన రెండు సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధిని రెఫరండంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలను సాధించినట్లు తెలిపారు. తాండూర్ పురపాలక సంఘం కౌన్సిలర్ల పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన ఉత్సవంలో భాగంగా మాట్లాడుతూ.. తాండూర్ ప్రజలకు ,ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తను రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధిపై ప్రజలు చక్కని తీర్పునిచ్చారని కొనియాడారు. తాండూరు ప్రజలు గత 20 సంవత్సరాల లో ఏనాడు ఇలాంటి తీర్పు ఇవ్వలేదని చెప్పారు. మెజారిటీ స్థానాలను తనపై నమ్మకంతో గెలిపించినట్లు చెప్పారు. ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ ఇవ్వడం వల్ల తనకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. గడచిన పదేళ్లలో జరగని అభివృద్ధిని రాబోయే రోజుల్లో చేసి చూపిస్తానన్నారు. ఎన్నికలప్పుడే ఎవరి పార్టీ వారు పోరాటం చేయాలని ఎన్నికల అనంతరం పట్టణ అభివృద్ధి పై దృష్టి పెట్టి కృషి చేయాలని ప్రతిపక్షాలను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగి సభలో ఇచ్చిన మాట ప్రకారం తాండూర్ ప్రజలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,కాగ్న నది తాగునీరు సరఫరా తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. తాండూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా నిలబెడతామని అన్నారు. తాండూర్ పట్టణ చైర్మన్గా ఎన్నికైన నీరజా బాలరాజ్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన అబ్దుల్ రజాక్, పట్టణంలోని 36 వార్డులలో గెలుపొందిన కౌన్సిలర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.