SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తాండూర్ వస్తున్నట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయానికి మంత్రి రాక ఊపునిస్తుందని దీంతో ఓటర్లలో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాండూర్ పట్టణంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలు అన్ని గమనించి విజ్ఞతతో ఓటు వేస్తారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని తాండూర్ లో కూడా గెలిపించినట్లయితే మరింత అభివృద్ధి చేసుకునేందుకు చక్కని అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు. విజయం దిశగా ప్రతి ఒక్కరు తీవ్రమైన కృషి చేయాలని బోధించారు. ప్రచార ఉధృతిని పెంచేందుకు మంత్రులతో పాటు సీఎం కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు రాక సందర్భంగా కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కార్నర్ పాయింట్ మీటింగ్లలో తప్పకుండా కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులు విశేష కృషిచేసి ఓటర్లను హాజరుపరచాలని కోరారు. అధికార పార్టీకి ఓటు వేద్దాం అభివృద్ధికి బాట వేద్దాం పిలుపునిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. నిజాంశాయి దర్గా పాత తాండూరులో ఉదయం 9 గంటల 25 నిమిషాలకు, మధ్యాహ్నం మరి చెట్టు కూడలిలో 12 గంటల 30 నిమిషాలకు కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.