* 16,17,18,9,10,11 లో స్ట్రీట్ మీటింగ్స్ లో కాంగ్రెస్ పై నిప్పులు
* తులం బంగారం వచ్చిందా !
* 2 వేలు పెన్షన్ 4 వేలు అయిందా !
____మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో నేపథ్యలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలోని 16 ,17, 18, 9 ,10, 11 వార్డులలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళలను కోటీశ్వరులు ఎప్పుడు చేస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలలో ఒక్క బస్సు ఉచితం తప్ప మిగతా ఏమి కూడా ప్రజలకు అందించలేదని ఆరోపించారు. మహిళలను పలకరిస్తూ తులం బంగారం వచ్చిందా! వృద్ధులను చూస్తూ రెండువేల పెన్షన్ 4000 అయిందా ! తులం బంగారం ఎప్పుడు వస్తుందని ఎద్దేవా చేశారు. పాత తాండూర్ లోని కొన్ని వార్డులలో, సాయిపూర్ లోని కొన్ని వార్డులలో కలిపి ఎన్నికల క్యాంపియన్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే దమ్ము లేదని అన్నారు.బేర ,సారాల కోసమే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా దోబూచులాడుతుందని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీ లపై నిప్పులు చెరిగారు. వెంకటేష్ చారి తదితరులు కాంగ్రెస్ పార్టీ నుంచి బి అర్ స్ పార్టీ లో చేరారు.
ఈ కార్యక్రమంలో ఆయా అవార్డుల బిఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.