SSNEWS (తాండూర్) : తాండూర్ లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ప్రచార పర్వంలో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆయా వార్డుల స్థానిక కార్యాలయాలను ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో ఉధృతంగా ప్రచార ఆర్భాటంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. ముఖ్యంగా మా అభివృద్ధి మాకు ప్రచార ఆస్త్రాలని వ్యాఖ్యానించారు. గత రెండు సంవత్సరాలుగా తాండూర్ పట్టణంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని దీనికి సిసి రోడ్ల నిర్మాణం , విద్యా ఉపాధి అవకాశాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రెండేళ్లలో 100 కోట్ల అభివృద్ధి చేపట్టామని అన్నారు. మా అభివృద్ధి చూసి ప్రజలు కౌన్సిలర్ గెలిపించాలని ఓటర్లను కోరారు.