SSNEWS (తాండూర్) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సజావుగా జరగాలని ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికలను పూర్తిచేయాలని తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ప్రోసైడింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం వారికి తగిన శిక్షణ ఇవ్వడం పూర్తయిందని ఉన్నారు. పట్టణంలో 140 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లోని అధికారులు, ఎన్నికల విధి విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలి.ఎలాంటి పొరపాట్లు తప్పొప్పులు జరిగిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విధులలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా తమ తమ విధులను సక్రమంగా పూర్తి చేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేందుకు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఈరోజు మూడు నామినేషన్లు ఉపసంహరణ జరిగినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నామినేషన్ ఉపసవరణ జరిగిందని తెలిపారు. రేపు 3 తారీకు, మూడు గంటల వరకు తమ తమ నామినేషన్లు ఉపసంహరించుకొనుటకు సమయం నిర్ధారించడం జరిగిందని కోరారు. మిగిలిన అభ్యర్థులు ఆయా పార్టీల గుర్తులు తోపాటు స్వతంత్ర అభ్యర్థులకు ప్రత్యేక గుర్తులు కేటాయించినట్లు వాటికి సంబంధించి విధివిధానాలు సూచించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ తో పాటు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ లలిత, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.