* యువకులకు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే
* బాతుల వెంకటేష్, బాతుల నాగు ఆధ్వర్యంలో ఏడవ వార్డు విజయం
* రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు
తాండూర్ (SSNEWS) : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు మొదలయ్యాయి. పురపాలక సంఘం ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారీ చేరికలు జరిగాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఏడవ వార్డు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో బాతుల వెంకటేష్, బాతుల నాగు ఆధ్వర్యంలో చేరినట్లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. బాతుల వెంకటేష్ ,బాతుల నాగు కృషిపట్ల సంతోషం వ్యక్తపరిచారు. 7 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని కార్యకర్తలను కోరారు. పార్టీ ప్రతి ఒక్కరిని ఆదరించి సమయానుకూలంగా అర్హతలను బట్టి ప్రోత్సహిస్తుందని సూచించారు. బాతుల వెంకటేష్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన శేఖర్ ,యజస్, జగ్గు, శంకర్, ఆజాం, జమీల్, యూనస్ అసిమ్, రవి ,సమీర్, రజాక్ ,సమీర్, సోహెల్ తదితర కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు.