👉 కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీలను షేక్ చేస్తున్న యువ కెరటం
👉 యువతరం ఓటర్లు ( GEN_Z) తో ప్రభంజనం
👉 నాకు అవకాశం ఇవ్వండి
అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం
👉 కమల దళం కదులుతుంది
విజయానికి నాందిగా
తాండూర్ (SSNEWS) : రాష్ట్రంలో చలి తగ్గుముఖం పడుతున్న మునిసిపల్ ఎన్నికల వేడి తో ఉత్కంఠ పెరుగు తుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ మున్సిపాలిటీ 36 వార్డుల్లో తో అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించింది. ఎనిమిదో వార్డు అత్యధిక ఓటర్లు తో ఉన్నది. వివిధ ప్రాంతాల ప్రజలు, విభిన్న వర్గాలతో కలగలిపిన ఈ వార్డు అంచనాలకు మించి గెలుపు ఓటములను తలకిందులుగా చేసే యువతరం ఓటర్లు పెరిగి ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వార్డులో ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదని బాహాటంగా ఓటర్లే విమర్శిస్తున్నారు. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో యువతను చెడు మార్గం వైపు నడిపించారాన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో యువతరం ఓటర్లు ప్రభంజనం లా కదిలి ముందుకు రావాలని యువ కెరటం రోహిత్ సుగంధి పిలుపునిస్తున్నాడు. 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ,బిఆర్ఎస్ పార్టీల లో నాయకులం అనే చెప్పుకునే వారు తమ సొంత లాభం కోసం అవకాశవాద రాజకీయాలు చేశారని ఆరోపించారు. పార్టీలు మారిన తీరును ప్రజలంతా నిశితంగా పరిశీలిస్తున్నరని తెలిపారు. ఇలాంటి తరచూ పార్టీలు మార్చి ఓటర్లను ప్రజలను తికమకపరిచే వారికి కాలం చెల్లిందని ధ్వజమెత్తారు. దేశమంతా అభివృద్ధి ధ్యేయంగా కమలదళం కృషి చేసిన తీరును ప్రజలంతా హర్షిస్తున్నారన్నారు. ఎనిమిదో వార్డులో కమలదళం కదులుతోంది విజయానికి నాందిగా అంటూ యువతరం ప్రభంజనం సృష్టిస్తామని అందుకు అందరి ఆశీర్వాదం కావాలని కోరుతూ మీ ముందుకు వస్తున్నట్లు రోహిత్ సుగంధి తెలిపారు. ఆశీర్వదించి, ఒకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కి అవకాశం ఇవ్వాలని కోరారు.