SSNEWS (ఊట్కూర్) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఊట్కూర్ లోని అయోధ్య నగర్ , ఈశ్వర్ మందిర్ లో కొలువైన మహా శివుని కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేశారు. సుందరమైన అలంకరణతో భక్తులకు మహా శివుని దర్శనం కల్పించారు. అనంతరం హాజరైన భక్తులందరికీ కార్యక్రమం నిర్వాహకులు అన్నప్రసాదం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, నాయకులు భాస్కర్, గోపాల్ రెడ్డి ,ఎల్కోటి జనార్దన్ రెడ్డి, సిరిగిరి సుభాష్, దత్తురావు, బుద్ధి భీం, కోస్గి హనుమంతు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు