👉 స్వదేశీ వస్తువులు వాడండి విదేశీ ని బహిష్కరించండి
👉 తాండూర్ కన్వీనర్ స్వ .జ.మంచ్ G.V.రమణ
SSNEWS (తాండూర్) : భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే స్వదేశీ విధానాన్ని అవలంబించాలని స్వదేశీ జాగరణ మంచ్ తాండూర్ కన్వీనర్ జీవీ రమణ పేర్కొన్నారు. స్వదేశీ జాగరణ మంచ్ విభాగ్ కన్వీనర్ టీ ప్రభాకర్ రెడ్డి చే స్వదేశీ జాగరణ మంచ్ తాండూర్ కన్వీనర్ గా తనను నియామకం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. మన దేశం ప్రపంచంలో నే అత్యంత కీర్తి ప్రతిష్టలు గడించాలంటే స్వదేశీ విధానాన్ని అవలంబించి, భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. స్వాతంత్రం కోసం ఆనాడు స్వదేశీ ఉద్యమం మొదలైందని మధ్యలో కొంత నిర్లక్ష్యం చేయబడిన గత పది ఏళ్ల నుంచి స్వదేశీ ఉద్యమంపై దేశ ప్రధాని ఎర్రకోట నుంచి పిలుపు ఇవ్వడం తో స్వదేశీ ఉద్యమం ఉదృతం గావించ బడిందని తెలిపారు.ఈ ఉద్యమాన్ని శక్తివంచన లేకుండా ముందుకు తీసుకు పోవడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను ఉద్యమంలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.