🇮🇳విభిన్న సంస్కృతుల ప్రదర్శనకు పెట్టింది పేరు కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్
🇮🇳పండగ ఏదైనా విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించడంలో మేటి కేకే స్కూల్
🇮🇳దేశభక్తి ,దైవభక్తి తో కలగలిపిన విద్యా నైపుణ్యత వారి ప్రత్యేకత
తాండూర్ (SSNEWS) : తాండూర్ పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, DRO మంగీలాల్ ప్రత్యేక అతిథులుగా హాజరై గౌరవ వందనాలు స్వీకరించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ పాఠశాలలు నిర్వహించిన విద్యార్థుల ప్రదర్శనలు చూడముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని, వారి కళాఖండాలను ప్రదర్శిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విభిన్న సంస్కృతుల ప్రదర్శనకు పెట్టింది పేరుగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శింప చేశారు. పండగ ఏదైనా, సందర్భం ఏదైనా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో వారికి వారే సాటి . దేశభక్తి దైవభక్తి తో కలగలిపిన విద్యా అందించడం వారి ప్రత్యేకత. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలలో చక్కని విద్యను అందిస్తూ ముందుకు సాగుతుంది తాండూర్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ . విద్యార్థుల ప్రదర్శనలు, సైనిక పరెడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ పార్టీల నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.