SSNEWS (తాండూర్): తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని చైర్మన్ ,వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో కౌన్సిలర్లు అందరి మద్దతు తో తాండూర్ మున్సిపల్ చైర్మన్ గా పట్లోళ్ల నీరజ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తను రాజకీయాల్లోకి వచ్చి చైర్మన్ కావాలన్న కోరికతో కృషి చేశాను. తన 15 సంవత్సరాల కల ఈనాడు నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన వార్డు ఓటర్లకు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన పదవి కాలంలో పట్టణ అభివృద్ధికి మొదటి ప్రధాన ఇస్తానని అన్నారు. పాలక పక్షం తో పాటు ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పట్టణాభివృద్ధికి విశేష కృషి చేస్తానని పేర్కొన్నారు.