* మీరిచ్చిన గౌరవాని మన్నిస్తూ మరింత సేవ చేసేందుకు సిద్ధం
____21 వ వార్డ్ బిజెపి అభ్యర్థి ప్రహ్లాద రావు జాదవ్
SSNEWS (తాండూర్) : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 21 వ వార్డు బిజెపి అభ్యర్థి ప్రహ్లాద రావు జాదవ్ పోటీ చేసి ఓడిపోయారు. మైనార్టీ ఓటర్లు అత్యధికంగా ఉండడం వల్ల తను ఓటమి చెందుతానని తెలిసినప్పటికీ ధైర్య సాహసాలతో ఆ వార్డులో నామినేషన్ వేసి తనదైన శైలిలో ప్రచారం కొనసాగించి పోరాడినందుకు కాలనీవాసులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు జనరల్ సెక్రెటరీ కోడూరు వినోద్ కుమార్, కోడూరు సంతోష్ కుమార్, కోడూరు గౌరీ శంకర్, కరణ్ కోట్ రేవన సిద్ధప్ప తదితర కాలనీవాసులు ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రహ్లాద రావు జాదవ్ మాట్లాడుతూ.. బిజెపి నాయకులు కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో, కాలనీవాసుల ప్రోత్సహంతో మైనారిటీ ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ గల్లి గల్లి తిరుగుతూ తనదైన రీతిలో ప్రచారాన్ని నిర్వహించినందుకు తనను సన్మానించిన గౌరవ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 21 వ వార్డు ప్రజల అభివృద్ధి కోసం తను ఎల్లవేళలా ముందుంటానని వారు అందించిన స్ఫూర్తితో మరింత ధైర్యంగా వార్డు ప్రజల సమస్యల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.