తాండూర్ (SSNEWS) : తాండూర్ మున్సిపల్ ఎన్నికల లో భాగంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాండూర్ లో సుడిగాలి పర్యటన చేశారు. ఏఐ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న అన్ని వార్డులలో కాలినడకన పర్యటన చేస్తూ కార్యకర్తలు, నాయకుల లో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా 14వ వార్డులో ఎంఐఎం పార్టీ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నా ప్రవీణ తో పాటు అవార్డు కార్యకర్తలు, నాయకులను కలుసుకొని విజయం సాధించాలని అభినందించారు. ఈ మేరకు ప్రవీణ మాట్లాడుతూ.. మా నాయకుడు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పర్యటనతో ఓటర్లలో విశ్వాసం పెరిగిందని అన్నారు.దీంతో భారీ మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాండూర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ హది సహారి సహకారంతో విజయాన్ని సాధించి పార్టీ జెండాను ఎగురవేస్తామని పేర్కొన్నారు.