SSNEWS (తాండూర్): నూటికి నూరు శాతం ఆస్తి పన్ను వసూల్ లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని తాండూర్ మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపులు నూటికి నూరు శాతం చేయాలని ప్రజలను కోరారు. ఇంటి యజమానుదారులు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పాత బకాయిలు ఉన్నవారికి రెడ్ నోటీసులు పంపిస్తామని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలతో కలిసి ట్యాక్స్ వసూలు చేసి రసీదులు అందించాలని సిబ్బంది కి సూచించారు. పట్టణంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే తన దృష్టికి తేవాలని, వాటి పరిష్కారం కోసం సరైన రీతిలో స్పందించి పరిష్కరిస్తామని తెలిపారు. ఆస్తి పన్ను వసూలు విషయంలో తమ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ ఆస్తి పనులు సక్రమంగా చెల్లించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మునిసిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, జి రాములు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.