* మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు
* నియామక పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
* ప్రజా సమస్యలపై స్పందించి పాలక పక్షంతో పోరాడాలి
* ఎవరు అధైర్య పడకండి వచ్చే ఎన్నికల్లో మనమే గెలుస్తాం
SSNEWS (తాండూర్): తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతం పెంచుకుంటూ 12 సీట్లు సాధించిందని ,5 స్థానాలలో కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందినట్లు చెప్పారు.పాలక పక్షానికి గట్టి పోటీ ఇచ్చి ధైర్యంగా ముందుకు సాగుతున్న కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బి ఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. ఈ మేరకు ఆమెను ఫ్లోర్ లీడర్ గా నిర్ధారిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై ఉండి ప్రజా సమస్యలపై స్పందించి పాలకపక్షంతో ప్రజల పక్షాన పోరాటం చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరు నిరాశ చెందకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నరసింహులు, శ్రీనివాస్ చారి, శోభారాణి, ఫ్లోర్ లీడర్ దీపా నర్సింలు, కౌన్సిలర్లు ఎండి జావిద్, రూప రుద్ర పాటిల్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.