తాండూర్ లో చైర్మన్ గిరి ముదిరాజులకా.. మున్నూరు కాపులక
👉 వెనుకబడిన ముదిరాజ్ బీసీవర్గం కు రాజ్యాధికారం లేనట్లేనా !
👉 మేల్కొనని బీసీ సంఘాలు
👉 రాజ్యాధికార అవకాశం
జారవిడుచుకున్న ముదిరాజులు
👉 చైర్మన్ ,వైస్ చైర్మన్ బీసీలకే సొంతం డిమాండ్ పై మౌనమేల
👉 ధనం మూలం ఇదం జగత్
SSNEW (తాండూర్) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ,కార్పొరేషన్ ల ఎన్నికలు ముగిశాయి . ఆయా ప్రాంతాలలో ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం చైర్మన్ ఎన్నికలు నిర్వహణకు శ్రీకారం మొదలైంది. ఆయా పార్టీల బలాబలాలను బట్టి మంగళవారం వరకు చైర్మన్ ల ఎన్నిక పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం. ఈ నేపథ్యంలో తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికైన కౌన్సిలర్లను క్యాంప్ కార్యాలయాలకు తరలించినట్లు తెలిసింది. తాండూర్ మున్సిపల్ చైర్మన్గా ఈసారి బిసి జనరల్ స్థానం కేటాయింపుతో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉన్నది. అయితే తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముందు పెను సవాల్ చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని అత్యంత భారీ మెజార్టీతో తాండూర్ 11వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ స్థానాన్ని బంటు వేణు గోపాల్ 909 ఓట్ల మెజార్టీతో దక్కించుకున్నారు. మరోవైపు 424 ఓట్ల మెజార్టీతో 12వ వార్డు కౌన్సిలర్ గా పట్లోళ్ల నీరజా స్థానాన్ని నిలుపుకున్నారు. ప్రధానంగా చైర్మన్ స్థానంపై వీరి ఇరువురు మధ్య గట్టి పోటీ ఉంది. మెజార్టీని,మరియు అత్యధిక ఓట్లు శాతం కలిగి ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం కొలమానంగా చూస్తే బంటు వేణుగోపాల్ కు చైర్మన్ స్థానం అవకాశం దక్కవచ్చు ను. ఇకపోతే మరో బీసీ కౌన్సిలర్ హ్యాట్రిక్ సాధించిన ఘనత నీరజ బాలరాజు కు అనుకూలం గా ఉంది.మరియు రెడ్డి సామాజిక వర్గం మద్దతు అధికంగా ఉండడం తో ఎన్నిక దాదాపుగా ఖరారు కావచ్చునని కాంగ్రెస్ వర్గాల సమాచారం. బిసి వర్గాలలో రాజకీయ పదవులు ఒక్క ఇంటికేనా అన్న చర్చ కలవర పెడుతున్నది. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి , రెడ్డి అనుకూల మున్నూరు కాపు రెడ్ల పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ శ్రేణుల ద్వారా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అణగారిన బీసీ వర్గాలకు అందులో ముదిరాజ్ వర్గానికి రాజ్యాధికారం లేనట్లేనని తేలిపోయిందని విశ్వాసనీయ సమాచారం. మున్నూరు కాపులు బీసీ కేటగిరీలోకి రాకూడదని వారు రెడ్డిలకు ఏమాత్రం తీసిపొరని తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా టీవీ డిబేట్లో చర్చలు కూడా జరిగాయి. 12వ వార్డు కౌన్సిలర్ నీరజా బాలరాజు(కుల ధ్రువీకరణ ప్రకారం వారు బీసీ) మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి, కానీ వ్యవహార శైలిలో వారు రెడ్డిలకు సమానమే, వారి పేరులో కూడా రెడ్డి అనే ముద్ర అన్నిచోట్ల కనిపిస్తుంది ,వినిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే,
మేల్కొనని బీసీ సంఘాలు
బీసీలకు రాజ్యాధికారం కావాలని గొంతు చించుకుంటున్న బీసీ సంఘాలు మేల్కొనడం లేదన్నది నిర్వివాదాంశం. ప్రతిసారి ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడి బీసీ సంఘాలు రెండుగా చీలిపోయి రెడ్డిల సరసన చేరడం ఆనవాయితీగా మారింది. కాబట్టి బీసీ సంఘాలు తమ ఉనికిని కోల్పోయాయని బీసీలలో చర్చ జరుగుతున్నది. బీసీలలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ వర్గానికి రాజ్యాధికారం కలగానే మిగిలి పోవచ్చునని తెలుస్తున్నది. నిజానికి చైర్మన్, వైస్ చైర్మన్లు స్థానాలు ఈ దఫా బీసీలకే దక్కవలసి ఉన్నది. కానీ బీసీ సంఘాలు మౌనముద్ర లో ఉన్నట్లు కనిపిస్తున్నది. మొత్తం మీద బీసీ లలో సామాజిక బలహీన వర్గాల పై కుట్ర కోణం దాగి ఉన్నదా ! ఏమోనని అనుమానం మాత్రం బీసీ వర్గాలలో, ప్రజలలో కలుగుతోంది. 12వ వార్డు కౌన్సిలర్ నీరజా బాలరాజు కు రెడ్డి కుల సంఘాల మద్దతు భారీగా లభించడంతో 400 పై చిలుకు మెజార్టీ పొంది సునాయాసంగా కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. అవార్డులోని రెడ్డి వర్గం అంతా ఒక్కటై అణగారిన బీసీ వర్గాన్ని ఓడించినట్లు పలువురు ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ధనం మూలం ఇదం జగత్
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బంటు వేణు గోపాల్, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నీరజ లు ఇద్దరు ఆర్థిక స్తోమతలో బలమైన వారిగా ఉండడం తో డబ్బే(దనం )ప్రధాన ఏ జెండాగా మారవచ్చునని పట్టణంలో ప్రధాన చర్చ కొనసాగుతోంది. ఈ చిక్కు సమస్యను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏ విధంగా పరిష్కరిస్తారో, మంగళవారం జరగబోయే చైర్మన్ ఎన్నికతో తెలుస్తుంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరగాలని కోరుకుంటూ.. వేచి చూద్దాం.