* కాంగ్రెస్ విధానాలపై మండి పడ్డ పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ (SSNEWS) : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేస్తూ విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడంపై బి ఆర్ ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు పట్టణంలోని ఇంద్రాచౌక్ లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలతో, ప్లకార్డ్ లు చేతపుని చౌరస్తా చుట్టూ తిరుగుతూ శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల పేరుతో బిఆర్ఎస్ నాయకులను వేధించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్ముక్కై కేసీఆర్ లాంటి మహోన్నత వ్యక్తికి నోటీసులు జారీ చేయడం వెనక కుట్ర కోణం దాగి ఉన్నదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులను ఉపసంహరించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కెసిఆర్ ను బెదిరించే దమ్ము ,ధైర్యం ఎవరికి లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని త్వరలోనే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకుడు పట్లోళ్ల నరసింహులు, నాయకులు శ్రీనివాస్ చారి, వెంకటరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, అబ్దుల్ సలాం, అనురాధ ,ఇర్షాద్, సంతోష్ గౌడ్ రాజన్ గౌడ్ ,పరిమళ రవీందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.